పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. మొదట స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ మండపంలో కల్యాణమూర్తులుగా కొలువుదీర్చారు. విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం, మాంగల్య ధారణ తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఈ క్రతువును అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించి మురిసిపోయారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: ఆ ఐదుగురు బాలికలను ఆదుకుంటాం: సత్యవతి