పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ క్యాంపస్‌లలో ఉన్న ఖాళీ స్థలాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు. వీటితో పోలీసుల కుటుంబాలకు తక్కువ ఖర్చుకే మండపాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని మొదటి బెటాలియన్ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి మహేందర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ పెళ్లి మండపాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు తెలిపారు.