హైదరాబాద్ జాబాంగ్‌లోని మార్క్‌ఫెడ్ భవన్‌లో ఛైర్మన్ మార గంగారెడ్డి అధ్యక్షతన 14వ టీఎస్ సహకార మార్కెటింగ్ సమాఖ్య పాలక మండలి సర్వసభ్య సమావేశం జరిగింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో సరఫరా చేసిన రసాయన ఎరువులు, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ, వానా కాలంలో రైతులకు ఎరువుల సరఫరా వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
వానాకాలం మార్కెటింగ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లను జరపనున్నట్లు చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయడానికి సరైన రవాణా సౌకర్యాలు, గిడ్డంగులు, గన్నీ బ్యాగుల సమస్య భవిష్యత్తులో అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్, సంస్థ పాలక మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.