స్త్రీలు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలరని మార్గదర్శి ఎండీశైలజాకిరణ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని.. వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. పనిచేసే మహిళగా ఉండడం సులభం కాదని కంఫర్ట్జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే స్త్రీలు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని అభిప్రాయపడ్డారు. మహిళలు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలని సూచించారు. స్త్రీలు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ... లక్ష్యం దిశగా ముందుకు సాగాలని ఉద్యోగినులకు శైలజాకిరణ్ పిలుపునిచ్చారు.
సాధించలేనిదేదీ లేదు
మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని... వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.