ETV Bharat / state

రామ్​సర్​ హోటల్​ 'చాయ్​ బంధం' తెగిపోయింది - రామ్​సర్​ హోటల్​

విరామం లేని  ఒత్తిడితో సాగే జీవనశైలి ప్రవాహంలో ప్రశాంతమైన ఒయాసిస్సులాంటిది టీ.. మారేడుపల్లి అంటే మరపు రానిది అక్కడ దొరికే ఇరానీ చాయ్​. స్థానికులకే కాదు ఈ ఊరొచ్చిన ఎవరికైనా ఇక్కడ ఇరానీ​ చాయ్​ బంధువే. ఈ హోటల్​ పేరే రామ్​సర్​. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ హోటల్​తో స్థానికులకు అనుబంధం తీరిపోయింది. వ్యాపారం లేక నేటితో చాయ్​ హోటల్​ మూతపడింది.

రామ్​సర్​ హోటల్​ 'చాయ్​ బంధం' తెగిపోయింది
author img

By

Published : Jun 30, 2019, 8:03 PM IST

మారేడుపల్లి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది రామ్​సర్​ హోటల్​.. అక్కడ దొరికే ఇరానీ చాయ్​. ఏళ్ల తరబడి చాయ్​ ప్రేమికుల అభిమానాన్ని చూరగొన్న ఈ హోటల్​ నేటితో మూతపడింది. 1962 లో ప్రారంభమైన ఈ హోటల్​ వృద్ధుల నుంచి చిన్నారుల వరకు అందరికీ సుపరిచితమే. అలాంటిదిప్పుడు వ్యాపారం లేక మూసేశారు.

ఇంతటి అభిమానాన్ని చూరగొన్న ఈ హోటల్​ నేటితో మూసేస్తున్నారంటే చాయ్​ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఇక్కడ చాయ్​ తాగనిదే వెళ్లేవారం కాదంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

మాకు బాధగానే ఉంది

ఈ హోటల్​ మూసేయడం తమకెంతో బాధగా ఉందని యజమాని తెలిపారు. నిత్యం వెయ్యి మందికి పైగా చాయ్​ తాగేందుకు వచ్చేవారని చెప్పుకొచ్చారు. ఇక్కడ వినియోగదారులకు.. సిబ్బందికి మధ్య విడదీయలేని చాయానుబంధం ఏర్పడిందన్నారు. నేటితో హోటల్​ మూసేస్తున్నందున ఈరోజు అందరకీ ఉచితంగా చాయ్​ బిస్కెట్​ అందించారు. స్థానికులు హోటల్​తో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్వీయచిత్రాలు తీసుకున్నారు.

రామ్​సర్​ హోటల్​ 'చాయ్​ బంధం' తెగిపోయింది

ఇదీ చూడండి: కేఫే ద లోకో రెస్టారెంట్... కుక్కలకు మాత్రమే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.