ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ కోరారు. ఈ పోరాటంలో అమరులైన వారి ఆశయాలను సాధించే వరకు పోరాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పోరాటంపై గతంలో ఎన్నడూ లేని విధంగా బహుముఖ దాడి కొనసాగిస్తున్నాయని విమర్శించారు. సమాధాన్ పేరుతో 2022 నాటికి దేశంలో విప్లవోద్యమాన్ని అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మోదీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో మూకదాడులకు పాల్పడుతోందని, సహభారత్ నిర్మాణం పేరుతో హిందూరాజ్య స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్నారని జగన్ ఆరోపించారు.
ఇవీ చూడండి:ఎస్సైపై డీజీపీకి రైతు దంపతుల ఫిర్యాదు