ETV Bharat / state

MAOIST JAGAN: 'భాజపాలో ఈటల చేరికకు వ్యతిరేకంగా మావోయిస్టుల లేఖ' - మావోయిస్టుల పత్రికా ప్రకటన

సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్​ ఒకే గూటి పక్షులని తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్​ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పేరుతో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Maoist jagan comments on cm kcr and ex minister etela rajender
తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్​ పత్రికా ప్రకటన
author img

By

Published : Jun 16, 2021, 3:35 PM IST

Updated : Jun 16, 2021, 4:32 PM IST

తన ఆస్తులను కాపాడుకోవడానికే మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపా తీర్థం పుచ్చుకున్నారని రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్​ విమర్శించారు. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్​ ఒకే గూటికి చెందిన పక్షులని ఆయన ఆరోపించారు. దీనిపై ఆయన పేరుతో కూడిన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మొన్నటి దాకా అధికారం అనుభవించిన ఈటల ఆస్తుల రక్షణ కోసమే కాషాయ కండువా కప్పుకున్నారని మండిపడ్డారు. ఆర్​ఎస్​ఎస్​, ఆర్​ఎస్​యూలను ఒకే గాటిన కట్టడం తగదని హితవు పలికారు. మాజీ మంత్రి ఈటలకు ఆర్​ఎస్​యూ, మావోయిస్టు పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వదని జగన్ పత్రికా ప్రకటనలో వివరించారు.

ఇదీ చూడండి: Harish Rao: 'ఈ నెల 20న సిద్దిపేటకు సీఎం కేసీఆర్​'

Last Updated : Jun 16, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.