ETV Bharat / state

Land Greviences: పార్ట్-బీ నుంచి పార్ట్‌-ఏలోకి మారేనా.. రైతుబంధు సాయం అందేనా..! - farmers facing Land ownership rights problems

అపరిష్కృతంగా ఉన్న భూయాజమాన్య హక్కుల సమస్యలు రైతులను ఆందోళనలోకి నెడుతున్నాయి. రైతుబంధు చెల్లింపులకు ఈ నెల పదో తేదీ కటాఫ్‌గా నిర్ణయించిన నేపథ్యంలో ఆలోగా సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నారు. వచ్చిన ఫిర్యాదులు, సమస్యలన్నింటినీ శనివారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్లకు డెడ్‌ లైన్‌ విధించారు. అటు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ను‌ కోరుతున్నారు.

పార్ట్-బీ నుంచి పార్ట్‌-ఏలోకి మారేనా
పార్ట్-బీ నుంచి పార్ట్‌-ఏలోకి మారేనా
author img

By

Published : Jun 4, 2021, 8:19 AM IST

పార్ట్-బీ నుంచి పార్ట్‌-ఏలోకి మారేనా

భూ రికార్డుల ప్రక్షాళన, తదనంతరం ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో వివిధ కారణాల రీత్యా కొన్ని భూముల యాజమాన్య హక్కులు పెండింగ్‌లో పడ్డాయి. విస్తీర్ణంలో హెచ్చతగ్గులు, నిషేధిత జాబితాలోకి వెళ్లడం, పేర్లు బదలాయింపు జరగకపోవడం, అప్‌డేట్‌ జరగకపోవడం, డిజిటల్ సంతకాలు లేకపోవడం.. ఇలా పలు కారణాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. అటవీ, ప్రభుత్వ భూముల వివాదాలు కూడా ఉన్నాయి. దీంతో పలు చోట్ల భూములు పార్ట్-బీకి వెళ్లాయి. కొన్ని భూములు ధరణి పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ కాలేదు. వీటన్నింటి దృష్ట్యా భూములపై హక్కులు దక్కకపోవడంతో రైతులు ఆందోళనకు లోనయ్యారు.

పరిస్థితులు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలాంటి వాటి కోసం ధరణి పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. పెండింగ్‌ మ్యుటేషన్లకూ అవకాశం కల్పించింది. భారీ సంఖ్యలోనే ఫిర్యాదులు వచ్చాయి. పెండింగ్ మ్యుటేషన్ల కింద కూడా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని పరిష్కారం కాగా.. మరికొన్ని అపరిష్కృతంగానే ఉన్నాయి. కరోనా రెండో వేవ్ విజృంభణ, లాక్‌డౌన్‌తో వాటి పరిష్కారం ముందుకు సాగలేదు.

ఆలోగా వచ్చిన వారికి రైతుబంధు సాయం..

అయితే వానాకాలం రైతుబంధు సాయాన్ని జూన్ 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కటాఫ్‌ తేదీని జూన్ పదిగా నిర్ధారించింది. పార్ట్-బీలో ఉన్న భూములు పార్ట్-ఏలోకి చేరేందుకు పదో తేదీని గడువుగా పెట్టుకోవాలని, ఆ లోగా వచ్చిన వారికి రైతుబంధు సాయాన్ని జమచేయాలని స్పష్టం చేసింది. దీంతో యాజమాన్య హక్కుల సమస్యలు ఉన్న రైతులు ఆందోళనలో పడ్డారు. పదో తేదీలోగా యాజమాన్య హక్కులు దక్కకపోతే రైతుబంధు సాయం జమ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పలువురు గత రెండు, మూడు రోజులుగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా భూముల సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. తమ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. వాటిపై స్పందిస్తున్న ఆయన.. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు.

స్పెషల్ డ్రైవ్..

అటు ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఉన్న ఫిర్యాదులన్నింటినీ రోజుకు 20 శాతం చొప్పున ఐదు రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ సోమేశ్‌ కుమార్ కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, సమస్యలు, మ్యుటేషన్లను అన్నింటినీ పరిష్కరించే పనిలో కలెక్టర్లు, అధికారులు నిమగ్నమయ్యారు. ధరణి ద్వారా వచ్చే ఫిర్యాదులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని.. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీలైనంత త్వరగా తమ ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించుకునే పనిలో సంబంధిత రైతులు పడ్డారు.

ఇదీ చూడండి: Grain soak: అకాల వర్షాలకు తడిసిన ధాన్యం... అన్నదాత కంటతడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.