ETV Bharat / state

నగరంలో ఇప్పటికీ నీటిలోనే కాలనీలు.. అందని తాగునీరు, భోజనం

వర్షం వెలిసి రెండురోజులైనా హైదరాబాద్‌ నగరంలోని అనేక కాలనీల్లో ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరగలేదు. జనం డాబాలపైనా, పై అంతస్తుల్లోనూ తలదాచుకున్నారు. చాలామంది ఖాళీ కడుపులతో మగ్గుతున్నారు. కొన్ని కాలనీల్లో నీటి మట్టం తగ్గినప్పటికీ పేరుకుపోయిన బురద సవాలుగా మారింది. చాదర్‌ఘాట్‌లో మూసీనది పరిసర కాలనీల రోడ్లు, ఇళ్ల లోపల కొండలా వ్యర్థాలున్నాయి.

Many colonies in Hyderabad are still under water
నగరంలో ఇప్పటికీ నీటిలోనే కాలనీలు.. అందని తాగునీరు, భోజనం
author img

By

Published : Oct 16, 2020, 8:03 AM IST

మూడ్రోజులుగా వరదలో ఉన్న ఉప్పుగూడ, శివాజీనగర్‌, ఛత్రినాక, జంగంమెట్‌ ప్రాంతాలకు బాలాపూర్‌ చెరువు గండి కొట్టడంతో మళ్లీ ప్రవాహం పోటెత్తింది. అధికారులు భోజనం అందిస్తామని చెప్పి ఫోన్‌ కట్టేశారని స్థానికులు తెలిపారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ప్రాంతాల్లోనూ బాధితులకు సాయం దక్కలేదు. మూసీ పరిసర ప్రాంతాలైన ఓల్డ్‌ మలక్‌పేటలోని శంకర్‌నగర్‌, మూసానగర్‌, కమలానగర్‌, వినాయక్‌నగర్‌, అఫ్జల్‌నగర్‌, పద్మానగర్‌లో బురద నిలిచిపోయింది. బాధితులను పట్టించుకోరా అంటూ స్థానిక ఎమ్మెల్యే బలాల గురువారం జీహెచ్‌ఎంసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా కాలనీలకు రెండ్రోజులుగా విద్యుత్తు లేదు. ఉప్పల్‌ రామంతాపూర్‌ చెరువు వెనుక ఉన్న కాలనీలు, నల్ల చెరువు సమీప కావేరినగర్‌, శ్రీగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, న్యూభరత్‌నగర్‌, సౌత్‌స్వరూప్‌నగర్‌, మల్లికార్జుననగర్‌, ధర్మపురికాలనీల్లోనూ అదే పరిస్థితి. కాటేదాన్‌ సమీప అలీనగర్‌లోని వెయ్యి ఇళ్లను జల్‌పల్లి పెద్దచెరువు, పల్లెచెరువు నీరు ముంచేసింది. 10 అడుగుల మేర నీరు చేరడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇప్పటికే 2,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. మిగిలిన వారు మొదటి అంతస్తులోని ఇళ్లలోనో, డాబాలపైనో ఉంటున్నారు. ఈ ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రాలేదని స్థానికులు వాపోతున్నారు.

తాగునీరు దొరక్క ఇబ్బంది

నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని లక్ష్మీబాగ్‌ కాలనీలో మోకాల్లోతు ప్రవాహం ఉంది. అధికారులు రెండు పూటలా భోజనం సరఫరా చేశారని, బయటకు వెళ్లి తాగునీరు తెచ్చుకోలేకపోతున్నామని స్థానికులు తెలిపారు. మల్లేపల్లి మాన్‌గార్‌ బస్తీ, అఫ్జల్‌సాగర్‌ కాలనీలో ఇళ్లు ఇప్పటికీ వరదనీటిలోనే మునిగి ఉన్నాయి. మెహిదీపట్నం సర్కిల్‌ వ్యాప్తంగా కూలిన చెట్లను తొలగించే ప్రక్రియ పూర్తికాలేదు.

ఇళ్లు.. వ్యర్థాల గూళ్లు

టోలిచౌకీలోని శాతం చెరువు దగ్గర నదీంకాలనీ, విరాసత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు మునిగిపోయాయి. అధికారులు బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. గురువారం ఒక్కొక్కరు కాలనీలకు చేరుకోగా ఇళ్లన్నీ బురద, చెత్త పేరుకుపోయి కనిపించాయి.

ఏ గూడు చూసినా గోడే!
కేటీఆర్ పర్యటన

వరద ప్రాంతాల్లో వ్యాధి నివారణ చర్యలు

ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. వరద ప్రభావం ఉన్న నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు కాచి వడపోసిన నీటినే తాగాలని సూచించారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి బీఆర్‌కే భవన్‌లో వరదలు, వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని. 104 వాహనాల ద్వారా వైద్య సహాయం అందిస్తున్నారని చెప్పారు. భవనాల వద్ద నీటిని తొలగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువుల వద్ద ముందస్తు చర్యలకు సాగునీటి శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. వరద పరిస్థితులపై పురపాలక శాఖ నివేదిక రూపొందించాలన్నారు.

బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రాంతాల నుంచి 196 మందిని రక్షించినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి.పాపయ్య తెలిపారు. ఇళ్లలో నీరు నిల్వ ఉంటే తొలగించేందుకు 101 నంబరుకు గానీ, 9949991101 నంబరుకు గానీ సమాచారం అందించాలని ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.