ETV Bharat / state

మట్టి గణపయ్యకే మొక్కు కుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనో నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల స్వరూపం మారిపోయింది. మంటపాలు, భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఇళ్లలోనే మట్టి వినాయకుడి ప్రతిమకు పూజలు చేసుకోవాలనే ప్రభుత్వ పిలుపునకు మంచి స్పందన వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వంతు కృషి చేస్తోంది. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మట్టి గణనాథుల ప్రతిమలకు సహజ రంగులు అద్ది అందంగా తీర్చిద్దిద్దారు.

manufacture-of-clay-ganapat
మట్టి గణపయ్యకే మొక్కుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం..
author img

By

Published : Aug 20, 2020, 7:12 AM IST

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పుట్టినిళ్లు తెలుగు రాష్ట్రాలు. పండుగలు, పర్వదినాలు ప్రకృతికి సరికొత్త శోభ తెస్తాయి. ప్రతి పండుగ రంగులతో కూడినదైతే మరీ శోభాయమానమే. పూర్తి పర్యావరణహిత గణేశుడికి తెలుగు లోగిళ్లు పెద్దపీటవేసి రసాయన అవశేషాల్లేని ప్రతిమల తయారీ, రంగులు ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌ ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం... 2016 నుంచి తన వంతు సహకారం అందిస్తోంది.

కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణం నేచురల్ డై ప్రొసెసింగ్‌, ఇంకుబేషన్ సెంటర్‌లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మట్టివిగ్రహాలకు సహజరంగులు అద్ది చక్కటి రూపమిస్తున్నారు. క్యాన్సర్ కారక సింథటిక్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధంగా లభ్యమైన పూలు, చెట్ల బెరళ్లతో తయారుచేసిన సహజ వర్ణాలు ఆ ప్రతిమలకు అద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ విగ్రహాలను చెరువుల వద్దకు వెళ్లి నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కుండీలో వినాయకుడిని నిమజ్జనం చేసి అనంతరం ఓ మొక్క నాటి నీరుపోస్తే అది పెద్దవుతుందని శాస్త్రవేత్తలు అన్నారు.

ఏటా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి... లక్ష విగ్రహాలు తయారు చేయించేది. అందుకోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రామచంద్రగూడ గ్రామ రైతుల నుంచి మ్యారీ గోల్డ్, బంతి పూలు, దానిమ్మ, బీట్‌రూట్‌, ఇండిగో, చెట్ల బెరళ్లు, అనాటో సీడ్స్ వంటివి సేకరించి ఈ అద్భుతమైన సహజ రంగులు తయారీ సాగుతోంది. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలోనే పరిసర ప్రాంతాల విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రతిమలు తయారు చేశారు. కాలుష్యం, ఆరోగ్యం, జీవవైవిధ్యం, పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలు, సహజ రంగుల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

వీటితోనే తయారు చేస్తారు

సహజ రంగుల తయారీ కోసం అనాటో, బంతి పూలు, మోదుగు పూలు, గింజలు, ఇండిగో, రతన్‌జ్యోతి, సపన్‌వుడ్‌, మంజిస్కా... ఇలా రకరకాల చెట్ల ఆకులు, బెరళ్లు, కాండాలు, గింజలు, పుష్పాలు వినియోగిస్తున్నారు. ఈ సహజసిద్ధ రంగులు శరీరంపై పడినా ఆరోగ్య సమస్య రాదు.

మరో ప్రత్యేకత ఉంది

ఒక పరిశ్రమ తరహాలో కొనసాగుతున్న ఈ కేంద్రంలో ఏకదంతా సహజ వర్ణమే అంతా.... ఈ ఏడాది కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ విద్యార్థుల భాగస్వామ్యం లేకపోవడం ఒకింత నిరుత్సాహం కలిగిస్తున్నప్పటికీ... మట్టి వినాయకుడు, సహజ రంగులు ముద్దు అన్న నినాదాన్ని శాస్త్రవేత్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఇళ్లల్లో గాలిని శుద్ధిచేసేందుకు ప్రతిమల తయారీలో కర్పూరం వినియోగించడం ఓ ప్రత్యేకత అని నేచురల్ డై ప్రొసెసింగ్, ఇంకుబేషన్ సెంటర్ నిర్వాహకురాలు పూజ సంకు వెల్లడించారు.

ఇవాళ గవర్నర్​కు, ముఖ్యమంత్రికి అందజేత

జీవవైవిధ్యం, పర్యావరణహిత అందమైన సహజ రంగుల గణనాథుల ప్రతిమలపై ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. సహజ వర్ణాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు స్వయంగా గురువారం... గవర్నర్‌ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నారు. ఏటా ఇది సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రక్రియకావడం విశేషం.

ఇదీ చూడండి: నదీజలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెడీ: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.