ETV Bharat / state

'నిజాయితీగా ఉంటూ... పేదలకు సేవ చేయడమే లక్ష్యం' - all india ranker services

హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని మన్సూరాబాద్​కు చెందిన సత్యప్రకాశ్... ఆలిండియా సివిల్​ సర్వీసెస్​ ఫలితాల్లో 218 ర్యాంకు సాధించాడు. గట్టి పట్టుదలతో.... ప్రణాళికాబద్ధంగా చదివి మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సొంతం చేసుకున్నానంటున్నాడు సత్యప్రకాశ్​.

'నిజాయితీగా ఉంటూ... పేదలకు సేవ చేయడమే లక్ష్యం'

author img

By

Published : Aug 5, 2020, 1:17 PM IST

Updated : Aug 5, 2020, 2:30 PM IST

నిజాయితీగా ఉంటూ... పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆలిండియా సివిల్​ సర్వీసెస్​ ఫలితాల్లో 218 ర్యాంకర్​ సత్యప్రకాశ్​ చెబుతున్నాడు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని మన్సూరాబాద్​కు చెందిన సత్యప్రకాశ్​ 218 ర్యాంకు సాధించాడు. తండ్రి అశోక్ బీఎస్ఎన్ఎల్​లో ఏజీఎం కాగా... తల్లి వసంత గృహిణి.

ఉన్నత విద్యను శ్రీ ఆదిత్య పాఠశాలలో పూర్తి చేసిన సత్యప్రకాశ్​... ఇంటర్మీడియట్ దిల్​సుఖ్​నగర్​లోని నారాయణ కళాశాలలో చదివాడు. 2018లో ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఐపీఎస్ కావాలనే గట్టి పట్టుదలతో.... ప్రణాళికాబద్ధంగా చదివి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకును సొంతం చేసుకున్నానంటున్నాడు. సత్యప్రకాశ్​కు సివిల్స్​లో ర్యాంక్ రావటం వల్ల తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.

'నిజాయితీగా ఉంటూ... పేదలకు సేవ చేయడమే లక్ష్యం'

ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

Last Updated : Aug 5, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.