ETV Bharat / state

నేడు హైదరాబాద్​కు మాణిక్​రావు ఠాక్రే.. టీ కాంగ్రెస్​లో ఐక్యతే లక్ష్యంగా అడుగులు - మాణిక్​రావు ఠాక్రే హైదరాబాద్​ 2రోజుల పర్యటన

AICC Incharge Manikrao Thakre visits Hyderabad: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య ఐక్యతే లక్ష్యంగా కార్యాచరణకు.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు శ్రీకారం చుట్టనున్నారు. నేడు మాణిక్​రావు ఠాక్రే హైదరాబాద్​ రానున్నారు. రెండు హైదరాబాద్​లో ఉంటూ పార్టీ నేతల మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఉంది.

AICC Incharge Manikrao Thakre
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు
author img

By

Published : Jan 11, 2023, 6:48 AM IST

AICC Incharge Manikrao Thakre visits Hyderabad : రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేధాలు తొలగించి.. అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే.. నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఇంఛార్జ్ హోదాలో తొలిసారి వస్తున్న ఠాక్రేకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకనున్న కాంగ్రెస్‌ నేతలు.. గాంధీభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నరకు గాంధీభవన్‌ చేరుకోనున్న ఠాక్రే.. నేడు, రేపు రాష్ట్ర నాయకులతో చర్చలు జరపనున్నారు.

తొలుత ఏఐసీసీ కార్యదర్శులతో ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి సహా ఇతర అంశాలపై చర్చిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. సీనియర్ నేతలు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చలు జరపనున్నారు. రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలతో.. మాణిక్‌ రావు ఠాక్రే సమావేశం కానున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, నేతల మధ్య సఖ్యత తీసుకురావడం సహా.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టేలా సూచనలు చేయనున్నారు.
ఎన్నో సమస్యలు: రాష్ట్ర ఇన్‌ఛార్జీగా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌ రావు ఠాక్రే.. ముందు పలు సవాళ్లు ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ నిర్ణయాలతో పలువురు సీనియర్లు విభేధిస్తున్నారు. కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే ఏర్పాటు చేసిన కొత్త కమిటీలపై కొందరు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే కీలక పదవులు ఇచ్చారంటూ ఎమ్మెల్యే సీతక్క సహా సుమారు 12 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు ఇచ్చారు.

ఆ సమస్య పరిష్కారం కొత్త ఇన్‌ఛార్జీకి కత్తిమీద సాము కానుంది. ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర కార్యాచరణ ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఆరు నెలలు పాటు పాదయాత్ర చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించగా.. కొందరు సీనయర్లు అభ్యంతరం వ‌్యక్తం చేశారు. రేవంత్‌ పాదయాత్రపై ఠాక్రే ఎలాంటి స్పషత ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన బాధ్యత కొత్త ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు ఠాక్రేపై ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.