ఒడిశాలోని గంజాం జిల్లా పురుషోత్తంపూర్ ప్రాంతానికి చెందిన తరిణి ప్రసాద్ మహాపాత్ర్ తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వద్ద ఐదుగురు కుటుంబ సభ్యులుండగా, తానూ ప్రసూతి వార్డుకు వెళ్తానని తరిణి పట్టుబట్టాడు. అందుకు నిరాకరించిన వైద్యుడు స్మృతిరంజన్‌పై దాడి చేశాడు.
అక్కడే ఉన్న పీజీ వైద్యవిద్యార్థి షకీల్‌ఖాన్, మరో నలుగురు వైద్యులు అడ్డుకోగా షకీల్ ఎడమ చెవి కొరికేయడంతోపాటు మిగిలిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తరిణి ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ పినాక్ తెలిపారు.
ఇదీ చూడండి: దిల్లీలోనూ 'దొంగ కరోనా' కేసులు- 75% అవే!