ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో రైతులతోపాటు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల్ని కుక్క తోకతో కేసీఆర్ పోల్చారని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. అందుకే నిరుద్యోగులు అంతా కసిగా ఉన్నారన్న ఆయన... హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విష జ్వరాలతో పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతుంటే... ఆసుపత్రులను డెంగీ జ్వరాల వివరాలు చెప్పవద్దని ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయిందన్నారు. బడ్జెట్‌లో 36 వేల కోట్ల రూపాయలు కోత పెట్టారని ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి కూడ సంక్షేమ పథకాలకు ఇంత పెద్ద ఎత్తున కోత పెట్టిలేదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'ఎక్కువ మార్కులొచ్చినా.... ఉద్యోగం రాలేదు'