గాంధీ భవన్లో గాడ్సే దూరిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. గాడ్సేల్లాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నది కేసీఆర్, కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ కాళ్లు మొక్కారు
భాజపాతో సీఎం కేసీఆర్(Mallu Ravi) కుమ్మక్కయ్యారు కాబట్టే.. రెండు సార్లు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. నోట్ల రద్దు నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకు కేంద్రానికి తెరాస మద్దతిచ్చింది. రైతులకు ఉరి తాళ్లుగా మారిన నల్ల చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయమంటే పారిపోయి భాజపాకు మద్దతిచ్చింది ఎవరు.? - మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు
ఏం చేశారో చెప్పండి
రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూస్తే కేసీఆర్, కేటీఆర్ల వెన్నులో వణుకు పుడుతుందని మల్లు రవి(Mallu Ravi) ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏడేళ్ల పాలనలో తెరాస.. ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లడగాలి కానీ.. కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఎందుకని మండిపడ్డారు. తాజాగా దళిత బంధు ఇస్తామని చెప్పి ఆపేశారని.. దళితులకు భూములు, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి పెండింగ్లో పెట్టారని(Mallu Ravi) ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ను నిందించడం కేటీఆర్కు ఫ్యాషన్ అయిందని అన్నారు. రాబోయే రోజుల్లో తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: KTR Speech: ఈటల, రేవంత్ భేటీ వెనుక మతలబేంటి?: కేటీఆర్