ETV Bharat / state

'ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ముందుకెళుతున్నాం' - ఇందిరాగాంధీ గురించి మాట్లాడిన మల్లు రవి

హైదరాబాద్ గాంధీభవన్​లో ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఆమె ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన మల్లు రవి
author img

By

Published : Oct 31, 2019, 6:22 PM IST

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన మల్లు రవి

మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వివరించారు. ఇందిర పాలనలో ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇందిరాగాధీ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

ఇదీ చదవండిః నెక్లెస్ రోడ్డు​లో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి

TG_hyd_52_31_MALLU_RAVI_PC_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. గమనించగలరు. () మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెలుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారన్నారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో...భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల అమలు తదితర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇందిర పాలనలో...ప్రజలకు ఆర్థిక సామాజిక న్యాయం జరిగేటట్లు పరిపాలన చేశారని తెలిపారు. అంతకు ముందు గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఆమె చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ,పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. బైట్‌: మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.