ETV Bharat / state

జననేత జైపాల్​ రెడ్డికి అశ్రునివాళి - కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​ రెడ్డి మృతి

జైపాల్​ రెడ్డి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు. జైపాల్​రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

జైపాల్​ రెడ్డి
author img

By

Published : Jul 28, 2019, 6:24 PM IST

Updated : Jul 28, 2019, 8:16 PM IST

జననేత జైపాల్​ రెడ్డికి అశ్రునివాళి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. జైపాల్​రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం ప్రకటించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి.. పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. ఈ తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయుడని కొనియాడారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీలు ట్విట్టర్​ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి మరణించారన్న వార్త బాధ కలిగించిందని రాహుల్​ పేర్కొన్నారు. తెలంగాణ,ఏపీ, మహారాష్ట్ర గవర్నర్లు జైపాల్​ రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

జైపాల్‌ రెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. సీఎంలు కేసీఆర్,నారాయణ స్వామి ​ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి...కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉత్తమపార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్​ కుమార్​ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్,ఈనాడు ఎండీ కిరణ్​, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు కాంగ్రెస్​​, భాజపా, కమ్యూనిస్టు, ప్రజాసంఘాల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు...

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ జోషిని ఆదేశించారు. జైపాల్​ రెడ్డి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 10.30 గంటల నుంచి 12గం.ల వరకు గాంధీభవన్​లో ఉంచుతారు. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటలోపు నెక్లెస్​ రోడ్డులోని పీవీఘాట్​ పక్కన అంత్యక్రియలు పూర్తి చేస్తామని గుత్తా సుఖేందర్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : జైపాల్​రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్

Intro:TG_hyd_75_27_medical_camp_at_madhuranagar_AB_TS10021
raghu_sanathnagar
మధుర నగర్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన వచ్చినట్లు సంక్షేమ సమితి జనరల్ సెక్రటరీ సాంబశివరావు పేర్కొన్నారు
ఈ మేరకు రామ్ మనోహర్ లోహియా రాజస్థాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆక్యుప్రెషర్ చికిత్స స్థానిక మధుర నగర్ లోని సాగి రామ రాజు ఆడిటోరియంలో వారం రోజుల పాటు నిర్వహించారు శనివారం సాయంత్రం వైద్య శిబిరం ముగింపు సందర్భంగా గా సంక్షేమ సమితి సభ్యులు లు వైద్యులను అభినందించారు

Body:ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థాన్ రాజస్థాని సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఆక్యుప్రెజర్ మాగ్నెటిక్ వైబ్రేషన్ చికిత్స శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో ఆక్యుప్రెషర్ మాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా అధిక బరువు రక్తపోటు మధుమేహం ఎసిడిటీ మెడనొప్పి తలనొప్పి థైరాయిడ్ వంటి అనేక వ్యాధులకు ఈ చికిత్స ఎంతగానో తోడ్పడిందని పలువురు పేర్కొన్నారు

Conclusion:ఇలాంటి శిబిరాలు మరెన్నో సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించాలని మధురానగర్ సంక్షేమ సమితి సభ్యులు కోరారు
ఈ కార్యక్రమంలో మధురానగర్ సంక్షేమ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Last Updated : Jul 28, 2019, 8:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.