Maharashtra leaders joined in BRS: భారత్‌లో పరివర్తనతోనే అభివృద్ధి సాధ్యమని... ఇందుకోసం పుట్టిన మిషనే.. బీఆర్ఎస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అలాంటి మార్పు వచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో మిషన్ భగీరథ్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లిస్తున్నామని... రైతు సంక్షేమం కోసం రైతుబంధు, బీమా అమలు చేస్తున్నామని... ఈ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయలేరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రంలో అనేక నదులు ప్రవహిస్తున్నా ఎందుకు సాధ్యం కావడం లేదన్నారు. ఇవన్నీ సుసాధ్యం చేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రంలోని జిల్లాపరిషత్తు ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తే సమస్యలు ఎందుకు పరిష్కారం కావో చూద్దామని పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే అన్నింటినీ సాధ్యం చేయవచ్చని కేసీఆర్ తెలిపారు.
'భారత్‌లో పరివర్తన లేకుండా సమస్యల్ని దూరం చేయలేం. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మళ్లీ అదే పద్ధతిలో కాకుండా మార్పురావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. నాగ్‌పూర్‌లో ఒక ఆఫీస్‌ను కొనుగోలుచేశాం. ఔరంగాబాద్‌లో కార్యాలయాన్ని కొనుగోలు చేస్తున్నాం. భారత్ పరివర్తన్ కోసం ఏర్పాటైన మిషన్ బీఆర్ఎస్. ఎప్పటివరకు మార్పురాదో అప్పటివరకు ఈ మిషన్ కొనసాగుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటైతే నూటినూరుశాతం రెండు, రెండున్నరేళ్లలో మహారాష్ట్ర మెరిసిపోతుంది.'-సీఎం కేసీఆర్
బీఆర్ఎస్లో చేరిన పలువురు మహరాష్ట్ర నేతలు: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో డీఎన్‌డీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌రావు అంగళ్వార్ బీఆర్ఎస్లో చేరారు. చంద్రాపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు రేష్మ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు బల్బీర్ సింగ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్‌తో పాటు గడ్చిరోలి మాజీ జడ్పీ ఛైర్మన్ సమ్మయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. తన వెంట నడవడానికి వచ్చిన మహారాష్ట్ర నేతలను సీఎం కేసీఆర్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
'మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని ఫడణవీస్ అన్నారు. తెలంగాణ మోడల్ అమలు చేస్తే వెళ్లిపోతామని చెప్పాం. ఫడణవీస్ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా లేదు. మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి. ప్రజల్లో పరివర్తన రాకపోతే దేశ ప్రజల కష్టాలు దూరం కావు. భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్ పనిచేస్తుంది'-ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీ చదవండి: