ETV Bharat / state

పాలమూరు బీజేపీ లోక్​సభ సీటు ఎవరిది? - రేసులో ఆ ముగ్గురు కీలక నేతలు

Mahabubnagar BJP MP Seat Issue : మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌పై భారతీయ జనతా పార్టీలో పోటాపోటీ నెలకొంది. బీసీ కేటగిరికి చెందిన ఓ నేత ప్రయత్నాలు చేస్తుండగా టికెట్‌ తమకే దక్కుతుందని మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలోనే కాకుండా రాజకీయవర్గాల్లోనూ చర్చనీయంగా మారింది.

BJP Focus on Parliament Elections 2024
Mahabubnagar Bjp MP Seat Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 8:32 AM IST

పాలమూరులో పోటీ చేసేదెవరు? - మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ టికెట్‌పై పోటాపోటీ

Mahabubnagar BJP MP Seat Issue : పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేస్తున్న వేళ పాలమూరు నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేదానిపై ఆసక్తి నెలకొంది. మహబూబ్‌నగర్‌ టికెట్‌ దక్కించుకునేందుకు బీజేపీకు చెందిన ముగ్గురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ ఒకరు. 2014లో బీజేపీ ఎంపీ టికెట్‌ ఆశించిన ఆయన పార్టీ తరఫున నామినేషన్‌ సైతం వేశారు. ఆఖరి నిమిషంలో అప్పట్లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది.

BJP Focus on Parliament Elections 2024 : ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ శాంతికుమార్ టికెట్‌ ఆశించగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి రెండు సార్లు టికెట్‌ త్యాగం చేసిన శాంతికుమార్‌ ఈ సారి మాత్రం తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లిన నేపథ్యంలో బీసీ కేటగిరికి చెందిన తనకే ఎక్కువ అవకాశాలున్నాయని శాంతికుమార్‌ భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్య 60శాతానికి పైగానే ఉన్నందున అవకాశం కల్పిస్తే విజయం తథ్యమనే ఆయన భావిస్తున్నారు.

10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యం - ఈ నెలాఖరున మోదీ బహిరంగ సభలతో ప్రచార పర్వానికి శ్రీకారం

BJP Lok Sabha Elections In Telangana 2024 : మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా టిక్కెట్ ఆశిస్తున్న మరోనేత మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి 2019లో బీఆర్ఎస్ నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం డీకే అరుణకు దక్కింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన మహబూబ్‌నగర్ నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. పార్టీ అధిష్ఠానం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్‌ నిబంధన విధించటంతో తన కుమారుడు మిథున్‌రెడ్డికి అవకాశమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిథున్‌రెడ్డి ఓటమి దృష్ట్యా ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్టు జితేందర్‌రెడ్డి చెబుతున్నారు. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఆ పది లోక్​సభ స్థానాలపైనే బీజేపీ స్పెషల్ ఫోకస్

"నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా గెలుపొందాను. ప్రజలు నన్ను ఎప్పుడూ తిరస్కరించలేదు. ఎంపీగా పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరాను. అదిష్ఠానం అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా." -జితేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీ

Mahabubnagar MP Elections 2024 : మహబూబ్‌నగర్ నుంచి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న మరో నేత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గతంలో మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీలో నిలిచిన ఆమె బీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీసీలకు అవకాశం కల్పిస్తామంటూ సొంత నియోజకవర్గం గద్వాలలో పోటీ నుంచి తప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. టికెట్‌ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని పార్టీ నిర్ణయమే శిరోధార్యమని డీకే అరుణ చెబుతున్నారు.

రెండు సార్లు టికెట్‌ త్యాగం చేసిన నేత ఓ వైపు జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకురాలు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడి ఓటమి తర్వాత పోటీకి సిద్ధమవుతున్న నేత ఇంకోవైపు. ఇలా పాలమూరు ఎంపీ టికెట్‌ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతున్న తరుణంలో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​కు బెదిరింపు ఫోన్​ కాల్స్​

కాంగ్రెస్​ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ : కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.