ETV Bharat / state

Highcourt reactions on Eenadu Story : ఈనాడు కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు - telangana latest news

Mahabubnagar Adulterated Liquor incident : ఏప్రిల్​ 13న ఈనాడులో ప్రచురితమైన మహబూబ్​నగర్​ కల్తీ కల్లు దుర్ఘటనను హైకోర్టు ప్రజపయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మహబూబ్​నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

kaltikallu
kaltikallu
author img

By

Published : Jun 16, 2023, 9:23 PM IST

mahabubnagar adulterated liquor : మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లుతో ముగ్గురు మృతి, 42 మంది అస్వస్థతకు దారి తీసిన కారణాలేమిటో పూర్తి వివరాలు సమర్పించాలని ఎక్సైజ్​శాఖను హైకోర్టు ఆదేశించింది. మహబూబ్​నగర్ జిల్లాలో కల్తీకల్లుతో 42మంది అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ముగ్గరు మృతి చెందగా.. మరొకరు గాయపడినట్లు ఏప్రిల్ 13న ఈనాడు కథనం ప్రచురితమైంది.

ఈనాడు కథనం ఆధారంగా విచారణ జరిపి బాధ్యులైన కల్లు దుకాణం నిర్వాహకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబ్​నగర్​కు చెందిన సామాజిక కార్యకర్త సీహెచ్ అనిల్​ కుమార్ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్​కు లేఖ రాశారు. ఈనాడు కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మహబూబ్​నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే.. మహబూబ్​నగర్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందడంతో పాటు దాదాపు 42 మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మహబూబ్​నగర్ జిల్లా కోడెరుకు చెందిన ఆశన్న, జిల్లా కేంద్రానికి చెందిన విష్ణుప్రకాశ్​తో పాటు కోడూరు గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ మృతి చెందింది.

కాళ్లు చేతులు వంకర్లు పోవడం, వాంతులు, ఫిట్స్, పాక్షిక అపస్మారక స్థితి లాంటి లక్షణాలతో మహబూబ్​నగర్ ఆస్పత్రిలో 12 మంది ఇన్ పేషెంట్లుగా, 30కి పైగా మంది అవుట్ పేషెంట్లుగా చేరారు. వీరి మరణానికి కల్తీ కల్లే కారణమనే ఆరోపణలున్నాయి. వైద్యులు మాత్రం మెటాబాలిక్ ఎన్క్లియోపతి అంటే కీలకమైన అవయవాలు విఫలం కావడం వల్ల మృత్యువాత పడ్డట్లుగా తెలిపారు. ఆల్కహాలిక్ విత్ డ్రావల్ సిండ్రోమ్ లక్షణాలున్నా ఏ తరహా ఆల్కహాల్ సేవించారని చెప్పలేమని వెల్లడించారు.

కారణం అది కాదన్న ఎక్సైజ్ మంత్రి.. ఈ మరణాలకు కల్తీకల్లు కారణం కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వారంతా ఆస్పత్రిలో చేరారని.. వైద్య నివేదికలు, వైద్యుల పర్యవేక్షణలోనూ అదే తేలినట్లు చెప్పారు. అలాగే వివిధ కల్లు డిపోల్లో నమానాలు సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. వచ్చే నివేదికల్లో కల్తీ కల్లే కారణమని తేలితే.. బాధ్యులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు. కల్తీకల్లుపై ఆధారాలుంటే పోలీసు లేదా ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.