ETV Bharat / state

పోలీసువారికి ఓ పూట భోజనంతో కృతజ్ఞత

లాక్​డౌన్​ అమలులో పగలూరేయి కష్టపడుతున్న పోలీసువారికి ఓ పూట ఆహారం అందించి కృతజ్ఞత తెలిపింది మధుకాన్​ సంస్థ. పోలీసులకు సహకరిస్తూ కరోనాను తరిమికొట్టాలని ప్రజలను ఆ సంస్థ నిర్వాహకులు కోరారు.

పోలీసువారికి ఓ పూట భోజనంతో కృతజ్ఞత
పోలీసువారికి ఓ పూట భోజనంతో కృతజ్ఞత
author img

By

Published : Apr 12, 2020, 7:31 PM IST

Updated : Apr 13, 2020, 1:17 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి మధుకాన్ ప్రాజెక్టు సంస్థ ఆహారాన్ని అందించి కృతజ్ఞత తెలిపింది. జూబ్లీహిల్స్ పోలీసు సిబ్బందికి ఓ పూట భోజనం అందించటమే కాకుండా... ఆ ప్రాంతంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఆ సంస్థ నిర్వాహకులు పంపిణీ చేశారు.

పేదలను ఆదుకోవటంలో తాము ఎప్పుడూ ముందుంటామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీతయ్య కుమారుడు తరుణ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పోలీసువారికి ఓ పూట భోజనంతో కృతజ్ఞత

ఇదీ చూడండి: ఈ ఏడాది చివరి వరకు వృద్ధులంతా క్వారం​టైన్​లోనే!

Last Updated : Apr 13, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.