ETV Bharat / state

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ - Tollywood actress in Drug Case

Madhapur Drugs Case Update : మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితుల ఫోన్లకు వచ్చిన కాల్స్‌ గురించి లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల సెల్‌ఫోన్లకు మాదకద్రవ్యాల కొనుగోలుదార్లు ఫోన్‌లు చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంతో మత్తు పదార్థాల వాడకందార్లు ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందనే ఆందోళనలో ఉన్నారు. కొందరు ఆగంతకులు ఇదే అదునుగా మత్తు వాడకందార్లను బెదిరించి.. వసూళ్ల పర్వానికి దిగుతున్నట్టు సమాచారం.

Tollywood Actress in Drugs Case Update
Madhapur Drugs Case Investigation
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 9:37 AM IST

Madhapur Drugs Case Update మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ

Madhapur Drugs Case Update : మాదకద్రవ్యాల వ్యవహారంలో తరచు వెలుగు చూస్తున్న కేసులు కలకలం రేపుతున్నాయి. రేవ్‌ పార్టీలు, వారాంతాల్లో పబ్‌లకు వెళ్లే వ్యాపార, రాజకీయ, సీనీ వర్గాల్లోని పలువురికి ఈ కేసులు దడపుట్టిస్తున్నాయి. సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మత్తు పదార్థాల కేసుల్లో పట్టుబడుతున్న వారు అధిక శాతం సినీ పరిశ్రమకు చెందిన వారే ఉంటున్నారు. ఇటీవల అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి, ఫైనాన్షియర్‌ వెంకటరత్నం రెడ్డి, రాంచంద్‌తో కలిసి నటుడు నవదీప్‌ సంబంధాలు గుర్తించిన నార్కోటిక్ పోలీసులు లోతుగా విచారణ(Narcotic Polices Investigation) జరుపుతున్నారు.

Navdeep Inquiry in Madhapur Drug Case : ఈ కేసులో నవదీప్‌ను ప్రశ్నించిన పోలీసులు.. ఈవెంట్‌ మేనేజర్‌ కలహర్‌రెడ్డి, సూర్య, సినీ నిర్మాత ఉప్పలపాటి రవిను ఇవాళ విచారించనున్నారు. గతంలో మాదకద్రవ్యాల రవాణా చేసే వారిపై మాత్రమే కేసులు నమోదు చేసేవారు. వినియోగదారులు పట్టుబడితే కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేసేవారు. ప్రస్తుతం వినియోగదారులను కూడా నిందితుల జాబితాలో పోలీసులు చేర్చుతున్నారు.

Constables Blackmails Drug Addicts Hyderabad : గత ఏడాది ఓయూ పోలీసులు అరెస్టు చేసిన గోవా డ్రగ్స్‌(Dugs in Goa) కీలక సూత్రదారి ఎడ్విన్‌ వద్ద కొకైన్‌, ఎల్​ఎస్​డీ బ్లాట్స్‌, ఎండీఏఏ కొనుగోలు చేసిన 175 మందిపైన కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి డ్రగ్స్‌ అమ్మేవాళ్ల వద్ద లభించే సమాచారంతో వినియోగదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

Narcotic SP Sunitha on Madhapur Drugs Case : 'నవదీప్​ ఫోన్​ డేటా డిలీట్ చేశాడు.. రీట్రైవ్​ చేసి మళ్లీ విచారిస్తాం'

ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు కానిస్టేబుళ్లు నిందితుల ఫోన్లలో లభించిన స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి పది నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్టు.. ఆరోపణలొచ్చాయి. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు.. హెచ్చరించడంతో వసూళ్ల పర్వానికి అడ్డుకట్టు పడింది. అయితే మరోసారి కొందరు ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్ల పర్వానికి దిగుతుండడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వసూళ్లు చేస్తుంది ఎవరనే విషయంపై లోతుగా విచారిస్తున్నారు.

Hyderabad Drugs Case Latest Update : ఈ కేసులో ఇప్పటికే సినీ నటుడు నవదీప్​ని విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చారని నార్కోటిక్​ ఎస్పీ సునీత తెలిపారు. నవదీప్​ ఫోన్​లోని డేటా అంతా తొలగించారని.. దాన్ని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఆ డేటాను సేకరించిన తరవాత మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు బయట పడగా.. దర్యాప్తు పూర్తి అయ్యేసరికి మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయని పోలీసులు తెలిపారు.

Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు

Madhapur Drugs Case Updates : నిత్యం వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ @ యాక్టర్ నవదీప్

Narcotics Bureau SP Sunitha Reddy Interview : 'మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నిందితుల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.