లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలోని చెక్‌పోస్టును మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా సందర్శించారు. వాహన తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రామ్‌దేవ్‌రావు ఆసుపత్రి ప్రాంగణంలో జప్తు వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్ విధానం పోలీసుల పనితీరును డీసీపీ ప్రశంసించారు. లాక్‌డౌన్ పూర్తయ్యేవరకు ప్రక్రియను కొనసాగించాలని తెలిపారు. కూకట్‌పల్లి చెక్ పోస్ట్ వద్ద 700 వరకు వాహనాలు జప్తు చేశామని, లాక్‌డౌన్ పూర్తైన అనంతరం వాహనాలను అపరాధ రుసుము చెల్లించి తీసుకోవచ్చన్నారు.