మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై మాదాపూర్ ఏసీపీ స్పందించారు. శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్ ఏసీపీ వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్ బోన్ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన సినీప్రముఖులు