ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసు నిందితులను.. పోలీసులు విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్య శాలలో చేర్పించారు. తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చేసిన సిఫార్సు మేరకు పద్మజ, పురుషోత్తం నాయుడుకు అక్కడ చికిత్స అందించనున్నారు.
ప్రస్తుతం నిందితులకు... మానసిక చికిత్స ఏ మేరకు అవసరం అవుతుందనే విషయంపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల ఇద్దరు కుమార్తెలను మూఢ నమ్మకాలతో.. దారుణంగా హతమార్చిన కేసులో పద్మజ, పురుషోత్తం నాయుడు రిమాండ్లో ఉన్నారు.
ఇవీచూడండి: బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను