రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. అనధికార, అనుమతులు లేని ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల 59 వేల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిని లే అవుట్ల వారీగా గ్రూపులు, క్లస్టర్లుగా విభజించి పరిశీలించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు.
క్లస్టర్లుగా విభజనతో ఒక లే అవుట్‌కు అర్హత ఉంటే అందులోని ప్లాట్ల దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరణకు అర్హత సాధిస్తాయని అర్వింద్ కుమార్ అన్నారు. క్రమబద్ధీకరణ రుసుము వివరాలను మొబైల్ నంబర్లకు ఎస్సెమ్మెస్ ద్వారా లేదా మెయిల్‌కు పంపుతామని వివరించారు.
ఇదీ చదవండి: ఈనెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్