రాష్ట్రంలో అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతోంది. పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల 486 దరఖాస్తులు వచ్చాయి. మీసేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసుల ద్వారా విరివిగా దరఖాస్తులు అందుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు అందిన దరఖాస్తుల ద్వారా అడ్వాన్స్ కింద రూ. 96 లక్షల మేరకు సంబంధిత ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీల నుంచి 2 వేల 946, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 2 వేల 316, మున్సిపాలిటీల నుంచి 4 వేల 224 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం