ప్రభుత్వానికి ఎల్ఆర్స్ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయితీల నుంచి మాత్రమే దాదాపు 8 లక్షల 33 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
పురపాలక సంఘం నుంచి 8 లక్షల 37 వేలు, నగరపాలక సంస్థ నుంచి 3 లక్షల 40 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.