రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మద్యం దుకాణాలకు ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మద్యం వ్యాపారులు సిండికేట్ అవడం వల్లే తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో 9 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఘట్కేసర్, బేగంపేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, దూల్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తులు తగ్గాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు సంబంధించి సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష