ETV Bharat / state

'నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో పెళ్లా?'.. 16 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రియుడు - Lover stabs ap woman in bengaluru

lover stabs ap woman 15 times for rejecting బెంగళూరులో యువతిని కత్తితో పొడిచి ప్రియుడు చంపేశాడు. కాకినాడ యువతిని నడిరోడ్డుపై 16 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. బెంగళూరులోని జీవనబీమానగర పరిధిలో నిన్న రాత్రి చోటుచేసుకుంది.

murder
murder
author img

By

Published : Mar 1, 2023, 4:49 PM IST

lover stabs ap woman 15 times for rejecting ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మురగేష్‌ పాళ్యలోని ఎన్‌ఏఎల్‌ రోడ్డులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసలు ఏం జరిగిందంటే...?

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన యువతి లీలా పవిత్ర. ఆమె వయసు 28 సంవత్సరాలు. ఆమె లాబోరేటరీ కంపెనీలో వర్క్ చేస్తుంది. అదే లాబోరేటరీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే వీరు ఇద్దరి పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. మొదట్లో బాగానే ఉన్నారు. గత ఐదేళ్లుగా దివాకర్, లీలా ప్రేమించుకున్నారు.

Lover stabs ap woman in bengaluru ఇక ఇటీవల వీరి బంధం గురించి లీలా తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. అయితే లీల ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా తను ప్రేమించిన దివాకర్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఇక ఆమెకు ఇటీవల మరో వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు లీలా బయటకు వచ్చింది. దివాకర్ తనను కాదని.. ఎవరో వ్యక్తిని పెళ్లాడేందుకు సిద్ధమైందని.. ఆమెపై పగతో రగిలిపోయాడు. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన లీలాపై విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు. తోటి ఉద్యోగులు చూస్తుండగానే... పలుమార్లు కత్తితో పొడిచాడు. రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న లీలాను స్థానికులు చూసి.. పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడు దివాకర్‌ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. లీలను పరిశీలించిన డాక్టర్లు... అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఇక లీల ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.