ETV Bharat / state

సేవే లక్ష్యం: భారత్​ రోడ్లపై లండన్​ వృద్ధ జంట చక్కర్లు

"మేఘాలలో తేలిపొమ్మన్నది... తుఫానులా సాగిపొమ్మనది..." అంటూ భారత్​ రోడ్లపై ఓ లండన్​ వృద్ధ జంట చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ చూడని ఓ ప్రత్యేక త్రిచక్రవాహనంలో దంపతులిద్దరూ రోడ్డు ప్రయాణాన్ని ఆస్వాధిస్తున్నారు. 35 రోజుల్లో 5,600 కిలోమీటర్లు తిరగాలన్న ఛాలెంజ్​ను సైతం పెట్టుకున్నారు. ఇంతకీ ఆ విదేశీ వృద్ధ జంట ఎందుకిలా చక్కర్లు కొడుతున్నారో తెలుసుకుందాం రండి...

LONDON OLD AGE COUPLE ROAD TRIP IN INDIA

author img

By

Published : Feb 10, 2020, 7:12 AM IST

Updated : Feb 10, 2020, 8:11 AM IST

ముదిమి వయసులోనూ... పేద ప్రజలకు ఏదో సేవ చేయాలని తలచిన వృద్ధ జంట... తమ మూలాలున్న దేశానికొచ్చారు. ప్రకృతిని ఆస్వాధించాలన్న వారి కోరికలోనే సేవా మార్గాన్ని వెతుక్కున్నారు. ఏ రోడ్డులోనైనా ప్రయాణించేందుకు ప్రత్యేకంగా సౌకర్యవంతమైన ఓ త్రిచక్ర వాహనాన్ని తయారు చేయించుకుని మరీ... నగరాలను చుట్టేస్తున్నారు. భారత్​లో గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థ... పాత బట్టలు సేకరించి వాటిని సరికొత్త తరహాలో తయారుచేసి పేద ప్రజలకు అందజేస్తుంది. ఆ సంస్థకు ఆర్థికసాయాన్ని అందించాలనే ఉద్దేశంతో భారత్​లో త్రిచక్ర వాహనంతో సాహసయాత్రకు సిద్ధమయ్యారు లండన్​కు చెందిన అలెన్ దంపతులు.

సేవే లక్ష్యం: భారత్​ రోడ్లపై లండన్​ వృద్ధ జంట చక్కర్లు

రూ.6 కోట్లతో ప్రత్యేక వాహనం...

లండన్​లో వ్యాపారవేత్త అయిన అలెన్ బ్రాత్ వేట్, అతని భార్య పాట్​తో కలిసి నాలుగు రోజుల క్రితం ముంబయి చేరుకున్నారు. 2018లో మోర్గాన్ సంస్థకు చెందిన ఓ పాతకారును రూ.6 కోట్లతో సరికొత్త త్రిచక్రవాహనంగా తయారు చేయించారు. ఏ రహదారిలోనైనా సులభంగా ప్రయాణించేలా వాహనాన్ని తయారు సిద్ధం చేసుకుని భారత్​ రోడ్లపై దూసుకుపోతున్నారు.

5,600 కిలోమీటర్లు చుట్టేసేలా...

35 రోజుల్లో 5,600 కిలోమీటర్లు చుట్టి రావాలని 'ట్సాన్స్​ ఇండియా ఛాలెంజ్​' పేరుతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అలెన్. నాలుగు రోజుల క్రితం ముంబయికి వచ్చిన ఈ జంట రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణిస్తూ... పూణె, సోలాపూర్ మీదుగా హైదరాబాద్​కు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ప్లేమింగ్... అలెన్ దంపతులకు స్వాగతం పలికారు. వారి వాహనాన్ని చూసి అవాక్కయ్యారు. అలెన్​తో కలిసి ఆ కారులో కాసేపు అలా అలా తిరిగొచ్చారు.

రోడ్​ట్రిప్​ ఆస్వాధిస్తున్నాం...

ఇండియా రావటం ఎంతో ఆనందంగా ఉందంటోన్న ఈ దంపతులు... తమ మూలాలు ఇక్కడే ఉండటం మంచి అనుభూతినిస్తోందని చెబుతున్నారు. తమ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయని.... భారత్​లో రహదారి ప్రయాణం నుంచి ఎన్నో నేర్చుకుంటున్నామని చెబుతున్నారు.

ఇవీ చూడండి: మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం

Last Updated : Feb 10, 2020, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.