ప్రశాంతమైన విశాఖలో చెప్పులు, కోడిగుడ్లతో దాడులు ప్రారంభించిన వైకాపా.. బాంబులు, కత్తులు తీసుకొచ్చేందుకు ఎంతోకాలం పట్టదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో అత్యాచారాల నిందితులు ఉండటం ఈ పరిస్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు సహకరిస్తున్న పోలీసులందరి పేర్లూ రాసుకుంటున్నామని హెచ్చరించారు. త్వరలోనే విశాఖలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి.. ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు