ETV Bharat / state

కేంద్రం ప్రతిపౌరుడికీ రూ.2 వేల ఫండ్ కేటాయించిందనే వార్తలో నిజమెంత? - lock down funds

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికీ రెండు వేల చొప్పున లాక్ డౌన్ ఫండ్ ప్రకటించిందంటూ... సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు సైబర్​ నేరగాళ్ల పనేనని హైదరాబాద్​ సైబర్​ క్రైం ఏసీపీ ప్రసాద్​ తెలిపారు. ఎవరూ... అలాంటి సందేశాలను నమ్మొద్దని సూచించారు.

lock-fund-release-news-are-fake-said-cyber-crime-acp-prasad
కేంద్రం ప్రతిపౌరుడికీ రూ.2 వేల ఫండ్ కేటాయించిందనే వార్తలో నిజమెంత?
author img

By

Published : Jul 8, 2020, 5:20 PM IST

దేశంలోని ప్రతి పౌరుడికీ కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ ఫండ్ మంజూరు చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్​ సైబర్​క్రైం ఏసీపీ ప్రసాద్​ సూచించారు. ఆ వార్త ప్రభుత్వం విడుదల చేసింది కాదని... సైబర్ కేటుగాళ్ల పన్నాగమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేరిట, మూడు సింహాల నకిలీ రాజముద్రతో ఉన్న ఆ ప్రకటనపై సైబర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లింక్​ క్లిక్​ చేస్తే ఖాతాలు ఖాళీ...

సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఆ ప్రకటనలో ఏముందంటే... "ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికీ రెండు వేల చొప్పున లాక్ డౌన్ ఫండ్ ప్రకటించింది. నీలిరంగులో ఉన్న https.t.lyndia-rellef అనే లింక్​పై క్లిక్ చేయండి... వెంటనే రెండు వేలు మీ ఖాతాలో జమ చేస్తాం.. ఆ లింకును 15 మందికి పంపండి' అని సందేశం ఉంది. తర్వాత మరో క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్ వివరాలు అడుగుతుంది. పొరపాటున ఎవరైన సమాచారం ఇస్తే... వారి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని ఏసీపీ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ సందేశాలు, లింకు​లు వస్తే వాటిని పట్టించుకోవద్దని... డిలీట్ చేయాలని ఏసీపీ సూచించారు.

ఇవీచూడండి: పత్తికి 'తెలంగాణ బ్రాండ్‌'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.