హైదరాబాద్ ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి పర్యటనను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వరదలు వచ్చినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అతివలు... ఎమ్మెల్యేపై మండిపడ్డారు. తమకు ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీశారు.
సహాయక చర్యలు తీసుకోకపోతే మీ పేరు రాసి చనిపోతామంటూ బెదిరించారు. మేం బతకాలా? చావాలా అంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులను ముఖం పట్టుకుని నిలదీశారు. చేసేదేం లేక వారు వెనుదిరిగారు.
ఇదీ చదవండి: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు