ETV Bharat / state

హైదరాబాద్‌ పరిధిలోపెరిగిన అతివల అక్షరాస్యత - Details of the literacy of women

హైదరాబాద్‌ పరిధిలో గత ఐదేళ్లలో లింగ నిష్పత్తి భేదం గణనీయంగా తగ్గడంతోపాటు, నిరక్షరాస్యత శాతమూ తగ్గింది. గతంలో ప్రతి 1000 మంది పురుషులకు 914గా ఉన్న మహిళల సంఖ్య ఇప్పుడు 959కి పెరగ్గా.. 79.35గా ఉన్న మహిళల అక్షరాస్యత శాతం ఇప్పుడు 83.6కు పెరిగింది.

హైదరాబాద్‌ పరిధిలోపెరిగిన అతివల అక్షరాస్యత

author img

By

Published : Dec 17, 2020, 9:58 AM IST

రంగారెడ్డి జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1024 మంది మహిళలుండగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 828 మందే ఉండడం గమనార్హం. ఈ రెండు జిల్లాల్లోనూ అక్షరాస్యత గతం కంటే పెరిగింది. రంగారెడ్డిలో 72.1, మేడ్చల్‌లో 79.5 శాతంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు చేశారంటే..

2019 జూన్‌ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3863 మంది పురుషులతో ఈ సర్వే చేపట్టారు. తాజాగా వివరాలు వెల్లడించారు.

అయిదేళ్ల తర్వాతే బడికి..

మూడు జిల్లాల పరిధిలో గతంలో మూడేళ్లు నిండగానే పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆరేళ్లు వస్తేగానీ పంపట్లేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ లెక్కన హైదరాబాద్‌లో పూర్వ ప్రాథమిక విద్యార్థుల శాతం 19.96% నమోదు కాగా.. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 19.8% మంది మాత్రమే వెళ్తున్నారు.

కుటుంబ నియంత్రణకే..

మూడు జిల్లాల పరిధిలో మహిళలు వివిధ పద్ధతుల్లో గర్భం దాల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. హైదరాబాద్‌లో 76.4% మంది ఏ పద్ధతి అయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. 1.4% మంది మాత్రలు వాడుతున్నారు. అలానే 12 నుంచి 23 నెలల మధ్య ఉన్న శిశువుల్లో హైదరాబాద్‌ పరిధిలో 84.3% మందికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, 5.3% మందికి ప్రైవేట్‌ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో 92.8%, ప్రైవేట్‌ కేంద్రాల్లో 7.2%, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో 81.9%, ప్రైవేటు కేంద్రాల్లో 18.1% మందికి టీకాలు వేయిస్తున్నారు.

అతివలూ శెభాష్‌
వివరాలిలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.