List of Goods that Price Changes From April 1st : ప్రతి దేశానికీ ఆర్థిక వ్యవస్థ కీలకం. ఇది ఎంత పటిష్ఠంగా ఉంటే.. దేశం అంత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశం.. ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటిస్తుంది. ఈ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. అగ్రారజ్యమైన అమెరికాలో.. ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై.. తర్వాతి ఏడాది సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఆస్ట్రేలియాలో జులై 1 తో ప్రారంభమై తర్వాతి సంవత్సరం జూన్ 30తో ముగుస్తుంది.
Price Changes on these goods From April 1st : ఇంగ్లండ్ దేశంలో ఏప్రిల్ 6 న స్టార్ట్ అయి.. తర్వాతి ఏడాది ఏప్రిల్ 5 తో పూర్తవుతుంది. చైనా ఆర్థిక ఏడాది జనవరి 1 న ప్రారంభమై డిసెంబరు 31తో ముగుస్తుంది. రష్యాదీ ఇదే పద్ధతి. ఇక మన దేశానికి వస్తే.. ఇది ఏప్రిల్ 1 తో స్టార్ట్ అయి.. మార్చి 31తో ఎండ్ అవుతుంది. ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన జపాన్ ఆర్థిక ఏడాదీ... మన లాగే ఉంటుంది.
Price Changes for Electric products in 2023 : మన దేశంలో ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023-2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లోని కొన్ని ప్రకటనల ప్రకారం.. కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. పలు సుంకాలు, శ్లాబుల్లో మార్పులు తీసుకువచ్చారు. దీని ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగ్గా.. కొన్నింటివి మాత్రం తగ్గనున్నాయి.
దేశీయంగా వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయాత్నాలు చేస్తోంది. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంది. వాటి ప్రకారం.. ఇండియాలో తయారయ్యే పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై ధరలు తగ్గించింది. వీటితో పాటు సామాన్యలు ఉపయోగించే సెల్ ఫోన్లు, బట్టలు, టీవీల ధరలు తగ్గనున్నాయి. ఇక మహిళలు అమితంగా ఇష్టపడే బంగారు, వెండి, ప్లాటినం ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఈ పూర్తి వివరాలేంటో మీరూ చూసేయండి.
ధరలు పెరిగేవి:
- బంగారం, వెండి, ఆభరణాలు, ప్లాటినం
- సిగరెట్లు
- ప్లాస్టిక్ వస్తువులు
- హెలికాప్టర్లు
- ఇమిటేషన్ ఆభరణాలు
- ప్రైవేటు జెట్లు
- దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు
- ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు
ధరలు తగ్గేవి :
- మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
- కెమెరా లెన్సులు
- దుస్తులు
- టీవీలు
- వజ్రాలు
- రంగురాళ్లు
- సైకిళ్లు
- బొమ్మలు
- ఇంగువ
- కాఫీ గింజలు
- ఇండియాలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు
- లిథియం అయాన్ బ్యాటరీలు
- పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన కొన్ని రసాయనాలు