తెలంగాణలో లాక్డౌన్కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు తెరిచేటట్లు చూడాలని ఎక్సైజ్ శాఖ సంచాలకులు సర్ఫ్రాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని... అబ్కారీ శాఖ ఉప కమిషనర్లకు, సహాయ కమిషనరలకు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.
ఇదీ చూడండి: అపోహలు వీడు.. కరోనాతో పోరాడు.