ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్​లో దశల వారీగా మద్యపానాన్ని నియంత్రిస్తున్నాం'

ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్​లో మద్యం వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్​ తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత మద్యం దుకాణాలు తగ్గించడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. దశల వారీగా మద్యం నియంత్రణ చాలా తొందరగా చేపడుతున్నట్లు వెల్లడించారు.

liquor-consumption-regulates-from-the-past-year-says-state-liquor-regulation-committee-chairman
ఆంధ్రప్రదేశ్​లో దశల వారీగా మద్యపాన నియంత్రణ
author img

By

Published : Jun 24, 2020, 7:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దశల వారీగా మద్యపాన నియంత్రణ వేగంగా చేపడుతున్నట్లు మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్​ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాలంగా మద్య నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలపై గుంటూరులో ప్రకటన విడుదల చేశారు.

లాక్​డౌన్​ అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల మద్యం వినియోగం 20 శాతం, బీరు 50 శాతం తగ్గిందని తెలిపారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. మద్యం నియంత్రణలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారిపై ఎక్సైజ్​ శాఖ కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇకపై తెలుగులోనూ ఫ్లిప్​కార్ట్ షాపింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.