ETV Bharat / state

'ట్రాఫిక్ స‌మ‌స్యలకు పరిష్కారం లింక్​రోడ్లు'

author img

By

Published : Jun 22, 2020, 6:47 PM IST

భాగ్యన‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్యల‌ను త‌గ్గించేందుకే లింక్​ రోడ్లను నిర్మిస్తున్నట్లు హైద‌రాబాద్ ర‌హ‌దారుల అభివృద్ధి కార్పొరేష‌న్ చీఫ్ ఇంజినీర్ వసంత చెప్పారు. జంట నగరాల్లో కీలకమైన నాలుగు ప్రధాన లింక్ రోడ్లను మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. జంట న‌గ‌రాల్లో మొత్తం 137 లింక్ రోడ్ల నిర్మాణాలు ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. అవీ పూర్తైతే సుమారు 126.2 కిలోమీటర్ల మేరకు దూరం త‌గ్గుతుందంటున్న సీఈ వ‌సంత‌తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.

Link roads to solve traffic problems in hyderabad
'ట్రాఫిక్ స‌మ‌స్యలకు పరిష్కారం లింక్​రోడ్లు'

'ట్రాఫిక్ స‌మ‌స్యలకు పరిష్కారం లింక్​రోడ్లు'

జులై చివరి నాటికి న‌గ‌రంలో మరో 33 లింక్ రోడ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామ‌ని హైద‌రాబాద్ ర‌హ‌దారుల అభివృద్ధి కార్పొరేష‌న్ చీఫ్ ఇంజినీర్ వసంత తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రధాన రహదారులపై వాహనాల రద్దీని తగ్గించి ట్రాఫిక్​ను నిరోధించేందుకు పురపాలక శాఖ సర్వేలను నిర్వహిస్తోందన్నారు. లింక్ రోడ్ల నిర్మాణం వల్ల దూరభారం, సమయం ఆదా అవుతుందని తెలిపారు.

హైదరాబాద్​లో 2024 నాటికి జనాభా 8.9 మిలియన్లను చేరుకుంటుందని ఆమె అన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కాంప్రెహెన్సీవ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)ను రూపొందించుకుందన్నారు. ప్రధాన రహదారులపై అన్ని వేళల్లో వాహనాల రాకపోకల రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ జామ్, వెహికిల్ పొల్యూషన్ వంటి వాటిని నిరోధించడం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో అంబులెన్సులు లింక్ రోడ్ల ద్వారా త్వరితగతిన గమ్యస్థానాలకు చేరుకోవ‌చ్చన్నారు.

ఇదీ చూడండి : కొత్త రకం మాదక ద్రవ్యాలతో అక్రమార్కుల నయా దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.