Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో కేరళ తీరంతోపాటు దానిని ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం లక్షద్వీప్‌లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వెల్లడించింది.
దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగా వీస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు.
ఇవీ చదవండి: