ETV Bharat / state

రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు - Telangana Meteorological Department Latest News

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం తుపాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు
author img

By

Published : Dec 2, 2020, 6:44 AM IST

Updated : Dec 2, 2020, 6:51 AM IST

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం తుపాన్‌గా మారనుందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.

‘బురేవి’గా నామకరణం చేసిన ఈ తుపాను బుధవారం సాయంత్రం లేదా రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలీ సమీపంలో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత అది శ్రీలంక మీదుగా ప్రయాణించి ఈ నెల 4న తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పంబన్‌ మధ్య మరోసారి తీరాన్ని తాకే అవకాశముంది. అప్పటికి కొంత బలహీనపడి గంటకు 65 కి.మీ నుంచి 85 కి.మీ వేగంతో కదలవచ్చని చెబుతున్నారు.

తుపాను ప్రభావంతో ఈ నెల 2, 3 తేదీల్లో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘2-4 తేదీల మధ్య తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 2, 3 తేదీల్లో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూతుకుడి, టెంకసి, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో తీవ్రప్రభావం ఉంటుంది. 3న దక్షిణ కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా జిల్లాల్లో పెనుప్రభావం చూపనుంది.

Last Updated : Dec 2, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.