రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ విదర్భ వరకు దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు.