-
టీఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహాణ అంశంపై తెలంగాణ భవన్‌లో మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి - భువనగిరి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. pic.twitter.com/YVeTKC17ex
— TRS Party (@trspartyonline) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">టీఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహాణ అంశంపై తెలంగాణ భవన్‌లో మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి - భువనగిరి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. pic.twitter.com/YVeTKC17ex
— TRS Party (@trspartyonline) October 21, 2021టీఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహాణ అంశంపై తెలంగాణ భవన్‌లో మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి - భువనగిరి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. pic.twitter.com/YVeTKC17ex
— TRS Party (@trspartyonline) October 21, 2021
తెలంగాణ విజయగర్జన సభ(Telangana Vijaya Garjana)ను దిగ్విజయంగా నిర్వహించేందుకు తెరాస శ్రేణులందరూ నడుం బిగించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పిలుపునిచ్చారు. విజయగర్జన సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో చర్చించారు.
నర్సాపూర్, మెదక్, పటాన్ చెరు, ఆందోల్, నారాయణ ఖేడ్, జహీరాబాద్, జగిత్యాల, మంథని, వేములవాడ, మానకొండూర్, భువనగిరి, ఆలేరు, కోదాడ, మునుగోడు, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని తెరాస ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నిన్న..
విజయగర్జన సభ సన్నాహకాల్లో భాగంగా నిన్న కూడా తెలంగాణ భవన్‌లో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, అశ్వరావు పేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నేతలకు కేటీఆర్ తెలిపారు. ఒకరిపై ఒకరు నెపం మోపవద్దని... అందరూ ఎవరిస్థాయి వారు ప్రజలను సభకు సమీకరించాలని చెప్పారు. తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ను ప్రతిపాదిస్తూ సహకర సొసైటీల ఛైర్మన్లు నామినేషన్ దాఖలు చేశారు.
నవంబర్ 15న...
రెండు దశాబ్దాల తెరాస (TRS) ప్రస్థానం, ఏడేళ్ల జనరంజకమైన పాలన, రాష్ట్రం సాధించిన చిరస్మరణీయమైన విజయాలను తెలియజేస్తూ నవంబరు 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట భారీ బహిరంగసభను జరుపుతామని కేటీఆర్ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు గ్రామ, మండల, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: Ktr on Vijaya Garjna: 'విజయగర్జనను మరిచిపోలేని విధంగా నిర్వహిద్దాం'