సాగు చట్టాలను నిరసిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 13వ రోజుకు చేరింది. ఈ దీక్షకు వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. దిల్లీలో సాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌డీవై నేతృత్వంలో విద్యార్థి, యువజన నాయకులు, విద్యార్థులు ధర్నాలో కూర్చుకుని నిరసన వ్యక్తం చేశాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వ్యతిరేకిద్దాం... రైతు పోరాటాలకు మద్దతు ఇద్దామని ప్లకార్డులు ప్రదర్శించారు. దిల్లీలో నెల రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహా రెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సొసైటీ పార్క్ కోసం మొక్క నాటిన నాగ్