కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రిలయన్స్ డిజిటల్ షోరూం ముందు ఆందోళన చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి నూతన సాగు చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు.
వైద్యం, విద్య కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్లిందని... ఇప్పుడు వ్యవసాయ రంగం వారి చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు. ఆందోళనకారులు దుకాణంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో... పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి