ETV Bharat / state

రాజ్​భవన్​ రోడ్డు కృష్ణా పైపులైన్​లో లీకేజీ

రాజ్‌భవన్‌ లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద కృష్ణానీళ్లు వృథాగా పోతున్నాయి. పైపులైన్‌లో లీకేజీ ఏర్పడి నీళ్లు రోడ్డుపాలవుతున్నాయి.

Raj Bhavan
author img

By

Published : Jul 27, 2019, 11:49 AM IST

Updated : Jul 27, 2019, 1:30 PM IST

ఓ వైపు వర్షాలు లేక నగరవాసులు నీటి కోసం అల్లాడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో అక్కడక్కడా భారీగా నీటివృథా జరుగుతోంది. సాక్ష్తాత్తూ రాష్ట్ర ప్రథమపౌరుడు నివసించే రాజ్‌భవన్‌ రోడ్​లోని.. లేక్‌వ్యూ అతిథిగృహం వద్దే ఈ వృథా కనిపించింది. పైపులైన్‌లో లీకేజీ ఏర్పడి ఉదయం నుంచి నీళ్లు భారీగా నేలపాలయ్యాయి. జీహెచ్​ఎంసీ సిబ్బంది గుర్తించినా... లీకేజీని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రమాదం జరగకుండా బారీకేడ్లు అడ్డుపెట్టారు. నీళ్లు వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్‌ తెరిచారు తప్ప నీటి వృథాను అరికట్టే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రాజ్​భవన్​ రోడ్డు కృష్ణా పైపులైన్​లో లీకేజీ

ఇవీ చూడండి:మాస్టర్ ప్లాన్​ సమర్పించండి: హైకోర్టు ఆదేశం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 27, 2019, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.