గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రజలు, అధికారులు ఉద్యోగులు, ఆరోగ్య, పోలీసు సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
ప్రజాప్రతినిధుల కార్యక్రమాల్లో సైతం భౌతిక దూరం నిబంధన పాటించడం లేదు. ఉప్పల్ నల్లచెరువు వద్ద జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు రాకముందు నుంచి భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెబుతున్నా నాయకులు పట్టించుకోలేదు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నిబంధనలు పెడచెవిన పెట్టి గుంపులు గుంపులుగా చేరారు. ఈ నేపథ్యంలో ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏ ఓక్కరికి కరోనా ఉన్నా అక్కడికి వచ్చిన వారికి అందరికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
ఇదీ చూడండి : వైద్యం కోసం ఇబ్బందులు... భయాందోళనలో స్థానికులు