సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు అనేక తీవ్ర విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెరాస నాయకుడు రవీంద్రగుప్త ధర్నా చేపట్టారు. డంపింగ్ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్‌కు పునర్నిర్మాణ పనులు చేపట్టి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పలు మార్లు అధికారులకు, కంటోన్మెంట్ సీఈవో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ 'కంగ్టి' పీహెచ్సీ