ఏపీలో గడిచిన 24గంటల్లో 57 వేల 752 కరోనా పరీక్షలు చేయగా... 733 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బాధితుల సంఖ్య మొత్తం 8 లక్షల 66 వేల 438కి చేరింది. ఏపీలో ఒక్కరోజులోనే ఆరుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6 వేల 976కి పెరిగింది.
కొత్తగా 1,205 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 12 వేల 137 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీచదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కాంగ్రెస్