ETV Bharat / state

'రోడ్డు కోసం పార్కు స్థలం వద్దు.. ప్రైవేట్ స్థలం తీసుకోండి'

author img

By

Published : May 2, 2020, 9:02 PM IST

చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే... పచ్చని పార్కును కబ్జా చేస్తున్నారని నగరంలోని హుడా ఎన్​క్లేవ్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని హూడా ఎన్​క్లేవ్ కాలనీలో మూడెకరాల జీహెచ్ఎంసీ పార్కును నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడంపట్ల కాలనీ వాసులు పెదవి విరుస్తున్నారు.

ప్రైవేట్ స్థలాల్లో రోడ్లు వేసుకోండి... ఇక్కడ కాదు : కాలనీ వాసులు

హైదరాబాద్ పరిధి జూబ్లీహిల్స్​ హుడా ఎన్​క్లైవ్ కాలనీలో 3 ఎకరాల పార్కును జీహెఎంసీ కబ్జా చేసి వాల్టా చట్టానికి వ్యతిరేకంగా 100 చెట్లను నరికేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్నారు. గత రెండు వారాల నుంచి అర్ధరాత్రి ఈ పనులు చేస్తున్నారని అన్నారు.

పక్కనే ప్రైవేట్ ఆస్తులు ఉన్నా పార్కులు ఎందుకు కబ్జా చేస్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అక్కడ రాళ్లను పగల గొట్టడం వల్ల పక్కనున్న ఇళ్ల గోడలు పగులుతున్నాయన్నారు. ఇళ్లల్లో కూడా భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని వాపోయారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ స్పందించి పార్కును యథాతథంగా ఉంచాలిన కోరారు. పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్తులు సేకరించి రోడ్డు నిర్మించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : ఎంత దూరమైనా రైల్ టికెట్ 50రూపాయలే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.